అనుష్కని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే..పాపం స్వీటీ..ఏడుస్తుందట..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క..అమ్మడు అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది. సూపర్ సినిమాతో సూపర్ హిట్ మూవీ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేసుకుంటూ పోయింది. తద్వారా, హిట్లు, ఫ్లాపులు తన ఖాతాలో వేసుకుంది. ఇక అరుంధతి సినిమా తో ఒక్కసారిగా ఇండస్ట్రీ లెక్కలు మార్చేసి..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది.

ఇక అప్పటి నుండి అమ్మడుని అంతా టాలీవుడ్ జేజమ్మ గా గుర్తించడం ప్రారంభించారు. అయితే , కెరీర్ బాగా సజావుగా సాగీపోతున్న టైంలో..ప్రయోగాత్మక సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ క్రమంలోనే వేదం సినిమాలో వేశ్య పాత్ర, జీరో సైజ్ సినిమా లో ఫ్యాట్ గా ఉన్న అమ్మాయి ప్తార చేసి..కెరీర్ ని అట్టర్ ఫ్లాప్ గా మార్చుకుంది. ముఖ్యంగా అనుష్క జీరో సైజ్ సినిమాకోసం అధికంగా బరువు పెరిగింది. లావు పెరగడానికి జంక్ ఫుడ్స్ , బిరియానీ లాంటివి బాగా తినేసింది.

అయితే, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ, సినిమా తరువాత మాత్రం అమ్మడు లావు తగ్గలేకపోయింది. ఇప్పటికి ఆ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానాతిప్పలు పడుతుంది. నిశబ్ధం సినిమా టైంలో ఆమె పై ఏ రేంజ్ లో బాదీ షేమింగ్ చేసారో మనకు తెలిసిందే. ఆ లావు తగ్గితే కానీ సినిమాలు చేయనని ..గట్టిగా ఫిక్స్ అయ్యిందట అనుష్క. ఇక ఆ కారణంతోనే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైన, ఈ లావు అనుష్కకు పెద్ద సమస్య గా మారింది అన్నది వాస్తవం..!!

Share post:

Popular