ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జీవిత-రాజశేఖర్ ఆ తర్వాత కాలంలో దర్శకురాలిగా మారి.. ఇటీవల కాలంలో తరుచూ వివాదాల్లో నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సంచలనం సృష్టిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే గత కొద్ది రోజుల వరకు గరుడవేగా సినిమా సమయంలో తనను దారుణంగా మోసం చేసింది అంటూ నిర్మాత కోటేశ్వరరాజ్ కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ విధి తమే. జీవిత ఈ విషయంపై స్పందిస్తూ తాను ఎవరినీ మోసం చేయలేదు అని.. ఆధారాలు లేకుండా తన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దు అంటూ కూడా మీడియా ముందు చెప్పుకు వచ్చింది.
నిర్మాత కోటేశ్వరరావు తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరు కాగా అందులో జీవిత రాజశేఖర్ దంపతుల గురించి అలాగే జీవిత గురించి ..ఆమె చేసిన మోసాలు గురించి బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ జీవిత రాజశేఖర్ స్వయంగా తన మామ వరదరాజన్ ని కూడా దారుణంగా మోసం చేసింది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఎన్నో వ్యాపారాలు చేస్తున్న మేము ఆగమనం సినిమా చేస్తున్న సమయంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి రాగా.. ఆ సమయంలో రాజశేఖర్ తో సినిమా చేయాలని వరద రాజన్ అడగడంతో మేము ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము.
ఇక ఆమె తన తెలివి తేటలకి గరుడవేగ సినిమా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఐపోతుంది అనుకున్నాము. ఇక ఈ విషయం తన మామ దగ్గర చెబితే ఈ సినిమా చేయకుండా తనని ఎక్కడ అడ్డుకుంటాతో అని జీవిత తన మామయ్యను మోసం చేస్తూ కేవలం రూ.5 కోట్ల లో మాత్రమే పూర్తవుతుందని అబద్ధాలు చెప్పి దారుణంగా మోసం చేసిందని తెలిపారు. జీవిత 75 శాతం పెట్టుబడి పెడితే నేను 25 శాతం పెట్టుబడి పెట్టేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నామ.
సినిమా మొదలైన తర్వాత జీవిత ఒక్క రూపాయి కూడా కట్టకుండా మొత్తం నాతోనే ఖర్చుపెట్టించింది. ఈ విషయం తెలుసుకున్న నేను సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పగా చివరికి జీవిత నన్ను బ్రతిమిలాడితే తన ఆస్తులను తాకట్టు పెట్టుకుని సినిమా రూ.26కోట్లకు ఇచ్చామని ఆయన తెలిపారు. తమ దగ్గర తాకట్టు పెట్టిన ఆస్తులను తమకు తెలియకుండానే వేరొకరి పేరు పైన రాసి జీవిత దారుణంగా మోసం చేసిందని గరుడవేగ సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజ్ తెలిపారు.