ఆ స్టార్ హీరోల భార్యలను చూసి భయపడుతున్న తమన్నా .. ఎందుకంటే..?

మిల్క్ బ్యూటీ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె కొంచెం గ్లామర్ షో ప్రదర్శించింది అంటే చాలు కుర్రకారు గుండెల్లో మంటలు పుడుతూ ఉంటాయి. తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.. ఇకపోతే సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు.. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో హీరో ల పరిస్థితి ఎలా ఉన్నా సరే హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం ఆ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది .

చెప్పినట్టు వినలేదని సినిమా రంగంలో నిలదొక్కుకోనివ్వకుండా చేసిన డైరెక్టర్లు, హీరోలు కూడా ఉన్నారు. వారే కాదు హీరోల భార్యలకు కోపం వచ్చినా కూడా ఆ హీరోయిన్ ని తెలుగు పరిశ్రమ దరిదాపుల్లోకి రానివ్వకుండా చేస్తోంది అనడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక చక్కటి విషయమే ఉదాహరణ అని చెప్పవచ్చు. మన తెలుగు హీరోల భార్యల కోపానికి తమన్నా గురైనట్లు సమాచారం అందుతోంది. అసలు విషయంలోకి వెళితే హ్యాపీ డేస్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత అందరూ అగ్ర హీరోల సరసన నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.

కొంతమంది అగ్రహీరోలతో సినిమా చేసేటప్పుడు త్వరగా షూటింగ్ అయిపోతే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కారణం మన హీరోల భార్యలు అనే చెప్పాలి . ఎందుకంటే అల్లు అర్జున్ పెళ్లయిన కొత్తలో బద్రీనాథ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక షూటింగ్ కి ఆయన భార్య స్నేహారెడ్డి కూడా హాజరైంది. అప్పుడే తమన్నా అందాన్ని చూసి ఫిదా అయిన స్నేహ షూటింగ్లో అల్లు అర్జున్, తమన్నా ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ లకు బాగా కోపం తెచ్చుకుందట.

ఇక తన కంటిచూపుతోనే తమన్నాను భయటపెట్టిందట స్నేహ రెడ్డి. అంతే కాదు స్నేహ పరిస్థితిని గమనించిన తమన్నా అల్లు అర్జున్ తో కూడా మాట్లాడడానికి భయపడేదట. ఆ తర్వాత ఎన్టీఆర్ భార్య ప్రణతి కి కూడా ఆమె భయపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో తమన్నా షూటింగ్లో ఉన్నప్పుడు వీరిద్దరిని చూసిన ప్రణతి ఇంటికి వచ్చాక తన నుంచి ఎన్టీఆర్ ను ఎక్కడ ఎగరేసుకు పోతుందో అని ఏడవడం మొదలు పెట్టిందట. ఉపాసన కూడా ఇలాగే చేసేదట.

రామ్ చరణ్ తో తమన్నా క్లోజ్గా ఉంటే ఉపాసనకు అసలు నచ్చేది కాదట. కానీ మిగతా ఇద్దరు హీరోల భార్యల కంటే రామ్ చరణ్ భార్య కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. రచ్చ సినిమా టైంలో ఉపాసనకు కోపం వచ్చినా సరే తమన్నాతో చాలా ఫ్రెండ్లీగా నే ఉండేదట. అలా ఈ ముగ్గురు స్టార్ హీరోల భార్య ల కారణంగా తమన్నా కు తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.