నేను తలచుకుంటే ఏదైనా చేయగలను.. సమంత సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరొయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ కుందనపు బొమ్మ నే ఈ సమంత. ఒక్క సినిమా తో తన పోజీషన్ ఏంటో అని ఇండస్ట్రీలో ముందే సెట్ చేసుకునేసింది. ఏమాయ చేసావే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి..తన అంద చందాలతో కుర్రాళ్ళ మాయ చేసేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత అందాలను ఢీ కొట్టే భామ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఏదో అరా కొరా కుర్ర హీరోయిన్లు సమంతను బీట్ చేయాలని చూస్తున్నా.. సమంత వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. భిన్న విభిన్న కంటెంట్ తో.. మరే హీరోయిన్ చేయలేనటువంటి రోల్స్ తో జనాలను మెప్పిస్తుంది.

సినిమాల పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తి గతంగా మాత్రం సమంత నెట్టింట ట్రోల్స్ కి గురి అవుతుంది. భర్త నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటి నుండి కొందరు ఆకతాయిలు సమంత పై వల్గర్ కామెంట్స్ చేస్తూ..దారుణంగా మాట్లాడుతున్నారు. ఆమె ప్రతి పోస్ట్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సమంత ఏ పోస్ట్ చేసిన అది..అక్కినేని ఫ్యామిలీ గురించే అన్నట్లు ఓ సో కాల్డ్ పనిలేని బ్యాచ్..హైలెట్ చేస్తుంది. మొన్నటికి మొన్న సమంత బికినీ పిక్ ని ఓ రేంజ్ లో వైరల్ చేసిన వాళ్ళు..ఇప్పుడు సమంత పోస్ట్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో టూ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలు చెప్పుతూ..అప్పుడప్పుడు ఇన్స్టా లో చిట్ చాట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజా గా సమంత .. చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ మ్యాగజైన్‌ కోసం నెమలి లా అందంగా మారి ..ఆ టైప్ లో డ్రెస్ డిజైన్ చేసుకున్న సమంత స్టన్నింగ్‌ ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ..”వయసు తో పాటు నాకు నెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏమైన చేయగలను. సెక్సీ రోల్స్ చేయగలను.. హార్డ్‌ కోర్‌ యాక్షన్‌ సహా ఢిపరెంట్‌ రోల్స్‌..ఏమైన చేయగలను. ఇంతకముందు వరకు నాకు ఆ ధైయం లేదు.. కానీ ఇప్పుడు నాకు వచ్చింది. ఇక పై నేను తలచుకుంటే ఏమైన చేయగలను”అంటూ స్టోరీలో రాసుకొచ్చింది సమంత. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీని సమ్మత విడాకులకు మ్యాచ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. దీంతో సమంత పేరు మరోసారి నెట్టింత హాట్ టాపిక్ గా మారింది.