సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వినిపిస్తున్న కామన్ పదం క్యాస్టింగ్ కౌచ్. దీనికి మరో పేరు కూడా ఉంది. అదే కమిట్ మెంట్. ఓ అమ్మాయిని అవకాశాల కోసం తమ కోరికలు తీర్చమని బలవంతం చేసి..వాడుకుని వదిలేసిన వారు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే.. ఆ లిస్ట్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. ఈ మధ్యనే ఓ ప్రముఖ యంగ్ హీరో కూడా “అవకాశం కోసం వెళ్లితే ఓ ఆవిడ నన్ను నగ్నంగా నిల్చోమన్నారు అని డైరెక్ట్ గానే” చెప్పేశాడు.
ఇక పలువురు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది..పలువురు డైరెక్టర్ర్లు మమ్మల్ని పక్కలోకి రమ్మన్నారు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. కానీ, పాన్ ఇండియా సినిమాలు..రికార్డ్లు బద్ధలు కొట్టాడాల పై ఉన్న ఇంట్రెస్ట్..అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలు పై మాత్రం మాట్లాడరు. విని వినన్నట్లు వెళ్లిపోతారు అంటూ పలువురు హీరోయిన్లు తిట్టిపోస్తున్నారు. అయితే, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ న్యూస్ లీకై సంచలనం గా మారింది.
ఓ స్టార్ హీరో భార్య..(ఒకప్పుడు హీరోయిన్) కి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు ఎదురైయాయట. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రోజుల్లో ఓ ప్రముఖ డైరెక్టర్ ఆమె వద్దకు వచ్చి..నా సినిమాలో ఆఫర్ ఇస్తాను చేస్తావా అని అడగ్గా..రోల్ బాగుంటే చేస్తాను అని చెప్పిందట. ఇక సడేన్ గా ఆమె చెయ్యి పట్టుకుని…నా కోరిక తీరిస్తే..నీ కోరిక తీరుస్తా అంటూ పరోక్షంగా పక్కలో పడుకో అని హింట్ ఇచ్చాడట.
దీంతో ఏడుస్తూ వెళ్లిపోయినా ఆమె..కొన్ని సంవత్సరాల తరువాత..ఓ స్టార్ హీరోకి భార్య అయ్యాక..సదరు డైరెక్టర్ ఆ హీరో తో సినిమా తీయ్యడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్న టైంలో..ఆమె ఈ విషయాని భర్తకు చెప్పి బాధపడిందట. దీంతో షాకైన స్టార్ హీరో.. ఇంటికి పిలిచి భార్య ముందే చెంప పై లాగి కొట్టారట..ఇంకోసారి ఏ ఆడపిల్లతో అయినా ఇలా బీహేవ్ చేస్తే..అంటూ పచ్చిగా బూతులు తిట్టాడట. ఆ డైరెక్టర్ సారీ చెప్పి సైలెంట్ గా వెళ్లిపోయారట. దీంతో స్టార్ హీరో భర్య అయిన హీరోయిన్ షాక్ అయ్యిందని..ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు అంతమౌతుందో ఎవ్వరికి తెలియడం లేదు.