కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బన్ని.. శభాష్ అంటున్న ఫ్యాన్స్‌..ఎందుకంటే..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..ఈయన పేరు చెప్పితే జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు. ఫ్యాన్స్ అయితే గాల్లో తేలిపోతారు. అలా ఉంటాయి బన్ని చూస్ చేసుకునే సినిమాలు. ప్రతి సినిమాలో వేరియేషన్..డ్యాన్స్ లో కొత్తదనం…లుక్స్ లో స్టైలీష్ నెస్..అబ్బో ఒక్కటా రెండా..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..బన్నీ గురించి వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న ఈ ఐకానిక్ స్టార్..పుష్ప సినిమాతో తన రేంజ్ నే మార్చేసుకున్నాడు.

అందరు హీరో ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలను తమ సినిమాలో పెట్టుకుందామా అనుకుంటుంటే..వాళ్ళు ఏమో మాకు బన్నితో నటించాలని ఉంది..బన్ని తో సినిమా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ అలియా భట్, దీపికా పదుకునే.. లాంటి హీరోయిన్లు డైరెక్ట్ గానే బన్నీ ని ఓ రేంజ్ లో పోగుడుతూ..బన్నీ తో ఒక్క సినిమా అయినా చేయాలని చెప్పుకొచ్చారు వాళ్ల రీసెంట్ ఇంటర్వ్యుల్లో. అది ఇప్పుడు బన్ని రేంజ్. ఇక మన సార్ రెమ్యూనరేషన్ పరంగా కూడా అస్సలు తగ్గట్లేదు. పుష్ప 2 కి ఏకంగా 100 కోట్ల పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, రీసెంట్ గా బన్నీ చేసిన ఓ పని అభిమానులకు తెగ నచ్చేసిందట. అందుకే అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఆయన పేరుని నెట్టింట ట్రెండింగ్ లో ఉంచారు. మనకు తెలిసిందే..బన్నీ సినిమాలతో పాటు..కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తారని..దానికి కూడా కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటాడని. అయితే రీసెంట్ గా ఓ బడా కంపెనీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి బన్నీకి కోట్లల్లో ఆఫర్ ఇచ్చారట. అయినా కానీ బన్నీ దాని రిజెక్ట్ చేశారట. అందుకు కారణం లేకపోను లేదు. అది పొగాకు సంబంధించిన యాడ్ అని..అది ఆరోగ్యానికి హానికరమని.. అలాంటి ఉత్పత్తులను తాను ప్రమోట్‌ చేయనని సదరు కంపెనీ యాజమాన్యానికి బన్నీ ఫేస్ మీదనే చెప్పేశాడట. దీంతో బన్నీ పేరు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది. కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయను..అనే డైలాగ్ ను బన్నీకి మ్యాచ్ చేస్తూ మీమ్‌స్ వైరల్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.