ఆచార్య నుండి స్పెషల్ గిఫ్ట్ రాబోతుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనించనుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని చూస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.