షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ చూశారా.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే ..కొత్త ఇల్లే కట్టుకోవచ్చట..!!

డబ్బు ఎవ్వరికి ఊరికే రాదు. మనలో చేతిలో నాలుగు రూపాయిలు ఉండాలంటే.. ఖచ్చితంగా కష్టపడాలి. అలా కష్టపడి వచ్చిన డబ్బులను దాచుకోవాలే కానీ దుబారా చేయకూడదు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. అది కూడా ఓ స్టార్ హీరోకి. దీంతో ఆ హీరో చేసిన పని నెట్టింట వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్..వామ్మో.. ఆ పేరుకి పెద్ద చరిత్రే ఉంది. ఇప్పట్లో అంటే స్పీడ్ తగ్గింది కానీ..అప్పట్లో ఓ రేంజ్ లో సినిమాలు చేసేవాడు. టూ రొమాంటిక్..ఫుల్ కామెడీ..కన్నీరు పెట్టించే ఎమోషన్స్..ఒకటా రెండా అన్ని పాత్రలను అవలీల గా చేసి.. తన నటనతో..డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు .

ఈ మధ్య కాలంలో షారుఖ్ తన కొడుకు డ్రగ్స్ విషయంగా మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. ఫైనల్లీ ఏదో లాగా బయటపడాడు అది వేరే మ్యాటర్. అయితే, ఇప్పుడు షారుఖ్ ఖాన్ సంబంధించిన ఓ విషయంలో మీడియాలో బాగా హైలెట్ అవుతుంది. ఈ బాలీవుడ్ కింగ్ ఏం చేసినా వెరైటీ గానే చేస్తుంటారు. ఇప్పుడు అదే చేశాడు. ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్న షారుఖ్..దానికి కోసం అధ్బుతమైన నేమ్ ప్లేట్ తాయారు చేయించుకున్నాడు. చూడగానే జనాలు అట్రాక్ట్ అవుతున్న ఆ నేమ్ ప్లేట్ ఖరీదు తెలుసుకుని షాక్ అవుతున్నారు.

ఆ నేమ్ ప్లేట్ కాస్ట్ అక్షరాలు 32 లక్షలట. అంటే ఓ సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. ఈ నేమ్ ప్లేట్ ని షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఎంతో ఇష్టంగా .. తన నైపుణ్యాలతో రూపాన్నిచ్చినట్టు తెలుస్తుంది. నేం ప్లేట్ బాగున్నా..కానీ దాని కోసం చేసిన ఖర్చు చూసి ఇప్పుడు దేశమంతటా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్..ఆశ్చర్యపోతుంటే..మరికొందరు..డబ్బు లు ఎక్కువైతే ఇంతే.. బయట రూపాయి సంపాదించదానికి ఎంత కష్టపడుతున్నారో.. డబ్బులు ఎక్కువైతే అలాంటి వాళ్లకి ఇవ్వు అంటూ మండిపడుతున్నారు. మొత్తంగా షారుఖ్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచాడు.

Share post:

Popular