రష్మిక కొత్త కండీషన్.. ఇలాగైతే కష్టమేనట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు సౌత్ స్టార్స్‌తో పాటు నార్త్ స్టార్స్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అమ్మడికి అదిరిపోయే డిమాండ్ పెరిగింది.

ఇక తనకున్న క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తు్న్న రష్మిక తమిళంలోనూ స్టార్ హీరో విజయ్ సరసన తన తొలి సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యింది. అయితే ఇలాంటి సమయంలో రష్మిక తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం దర్శకనిర్మాతలకు కొత్త కండీషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న ఈ బ్యూటీ, తన నెక్ట్స్ ప్రాజెక్టులన్నీ కేవలం స్టార్ హీరోలతోనే చేయాలని ఫిక్స్ అయ్యిందట.

అంతేగాక తాను చెప్పిన రెమ్యునరేషన్‌లో ఎలాంటి కోత లేకుండా పూర్తిగా ఇస్తేనే తన నెక్ట్స్ మూవీని ఓకే చేయబోతుందట ఈ బ్యూటీ. ఇలా రష్మిక కొత్త కండీషన్లతో ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని చూస్తున్న దర్శకనిర్మాతలకు సరికొత్త సమస్య వచ్చి పడుతోంది. అమ్మడి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నవారికి ఇప్పుడు అది కష్టంగానే మారబోతున్నట్లు తెలుస్తోంది. మరి రష్మిక కొత్త కండీషన్లను ఓకే చేసి మరీ ఆమెను ఎవరు తీసుకుంటారో చూడాలి అంటున్నారు ఈ విషయం తెలుసుకున్నవారు.