బిగ్ షాకింగ్: విడాకులకు అప్లై చేసిన మరో యంగ్ జంట..ఎంత దారుణమంటే..?

ఈ మధ్య కాలంలో సమాజంలో ఎక్కువుగా వినిపిస్తున్న పదం డివర్స్..విడాకులు. ఏదో నాకు ఈ బొమ్మ వద్దు అన్నంత ఈజీ గా చెప్పేస్తున్నారు ఈ కాలం యువతి యువకులు. అది కూడా ఐదు ఆరేళ్లు ప్రేమించుకుని..ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని.. గ్రాండ్ గా పెల్లి చేసుకుని.. ఆ హనీ మూన్ వ్యవహారం కూడా అయిపోయాక ..మా మధ్య బాండింగ్ కుదరదం లేదు అంటూ చెత్త సాకులతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో నే ఎక్కువుగా..ఈ డివర్స్ జరుగుతుండటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అది కూడా పెద్ద పెద్ద హీరోలు.. బడా బడా స్టార్ కూతుళ్లు ఇలా విడాకులు తీసుకుంటుండటంతో ఇండస్ట్రీలో వాళ్ల పరువు పోతుంది. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ఐశ్వర్య-ధనుష్,లాంటి స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నాం అని అధికారికంగానే ప్రకటించారు. కాగా, ఈ బాటలోనే ఇప్పుడు మరో యంగ్ జంట..విడాకులకు అప్లై చేసిన్నట్లు తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..కోలీవుడ్ ఇండస్ట్రీలో ని ఓ స్టార్ హీరో.. విడాకులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ప్రేమించి పెల్లి చేసుకున్న ఈ జంట.. ఇద్దరు సినీ సెలబ్రిటీలు కావడం గమనార్హం. వీళ్ల ప్రేమ వ్యవహారం..అప్పట్లో బిగ్ సెన్సేషన్ గా నడిచింది. ఎందుకంటే.. ఆ హీరో కి ఇదివరకే ఓ హీరోయిన్ తో సంబంధం ఉందని..వాళ్లు క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా మీడియాలో లీక్ అవ్వడంతో సీన్ హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ ఆమెతో బంధం కట్ చేసుకున్న హీరో.. ఫైనల్ గా మరో హీరోయిన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ హీరోయిన్ కి కూదా విడాకులు ఇచ్చేయడానికి రెడీ అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలా వరుస డైవర్స్ మ్యాటర్స్ సినీ ప్రముఖులకు మింగుడు పడనివ్వడం లేదు.