చేతగానితనం అనుకోవద్దు..సమంత స్ట్రైట్ వార్నింగ్..!!

టాలీవుడ్ కుందనప్పు బొమ్మ సమంత.. ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అందంగా చీర కట్టినా..సెక్సీ గా మెడ్రెన్ డ్రెస్ వేసినా..చూడటానికి చక్కగానే కనిపిస్తుందటారు ఆమె అభిమానులు. ఏమాయ చేసావే సినిమాలో సమంతను చూసి.. ఆ నాడే అభిమానులు ఫిక్స్ అయిపోయారు..ఈ బొమ్మ ఇండస్ట్రీని ఏలేస్తుందని. అదే జరుగుతుంది..ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో. కుర్ర బ్యూటీలు ఎంత మంది వచ్చినా కూడా సమంత అందాని బీట్ చేయలేకపోతున్నారు. పర్ఫెక్ట్ ఫిజిక్ తో..అలా మెయిన్ టైన్ చేస్తుంది సామ్.

సినిమాల పరంగా సామ్ ఏ హీరోయిన్ కి కూడా అందనంతగా ఎదిగిపోయింది. వరుస సినిమాలకి కమిట్ అవుతూ.. కెరీర్ ని ఫుల్ బిజీ బిజీ గా ఉంచుకుంది. ముఖ్యంగా విడాకుల తరువాత సమంత లో చాలా మార్పు వచ్చింది. ఈ విషయం అందరు గమనించిందే. ఇంతకముందు ఏ పని చేసినప్పుడైన ఆలోచించేది.. ఇప్పుడు ఆలోచిస్తుంది అనుకోండి..కానీ, తన గురించి మాత్రమే. ఈ పని చేస్తే..నేను హ్యాపీ గా ఉంటానా లేనా అని మాత్రమే ఆలోచిస్తుంది. ఇక సమంత పని నచ్చని వాళ్లు కూడా ఉన్నారు.

అమ్మడు ఏ డ్రెస్ వేసినా.. ఏ పోస్ట్ పెట్టినా..ట్రోల్ చేసే వాళ్లకి సమంత ఎప్పటికప్పుడు ఘాటు కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అలాంటి కౌంటర్ నే ఇచ్చింది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా.. ఘాటుగా మొహం పగిలిపోయేలా చేసింది. “నేను సైలెంట్ గా ఉన్నాను అంటే దానిని అజ్ఞానం అనుకోవద్దు. ఏదైనా అంగీకరిస్తానని అస్సలు అనుకోవద్దు. నా మంచితనాని చేతగానితనంగా తీసుకోవద్దు. మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది” అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అయితే ఇక్కడ సామ్‌ ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చిందో అర్ధం కావడం లేదు. బహుశా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడని..వార్తలు వస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏదిఏమైనా సామ్ కు ఓ విషయంలో బాగా కోపం వచ్చింది అనేది ఈ పోస్ట్ బట్టే అర్ధమైపోతుంది.