మీ అభిమానం తగలెయ్య.. ఏం పనులు రా ఇవి..?

జనరల్ గా హీరో , హీరోయిన్లు అంటే ఫ్యాన్స్ ఉంటారు..అది కామన్. వాళ్ల యాక్టింగ్ స్టైల్ నచ్చి..డ్యాన్సింగ్ స్టెప్స్ నచ్చి..ఎక్స్ ప్రేషన్స్ నచ్చి.. వాళ్లు చూస్ చేసుకునే కధలు బట్టి..ఒక్కోకరు ఒక్కోలా ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు అభిమానం అంటే సినిమా నచ్చితే పొగడడం..మీరు చూడండి బాగా చేశారు అని యంకరేజ్ చేయడం లా ఉండేది. కానీ ఇప్పుడు మా హీరో గొప్ప అంటే మా హీరో మహా గొప్ప అంటూ రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేసుకోవడమే చూస్తున్నాం. హీరో ల పరిస్ధితి ఇలా ఉంటే.. హీరోయిన్ల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది.

తమ అభిమాన హీరోయిన్ ఎక్కడైన కనిపిస్తే రొడ్డు మీదనే ఆపేస్తున్నారు. ఇలానే అభిమానుల పిచ్చి అభిమానం ధాటికి అనుపమ పరమేశ్వరన్ కొంచెం సేపు నలిగిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స్దానం సంపాదించుకోలేకపోయినా..యావరేజ్ హీరోయిన్ గా సెటిల్ అయిన అనుపమ..నాచురల్ యాక్టింగ్ తో అందరిని మెప్పిస్తుంది. కళ్లతోనే ఎలాంటి ఎక్స్ ప్రేషన్స్ అయిన పలికించగల ఈ భామ..మొదట్లో పద్ధతి గా ఉన్నా,,ఆ తరువాత రాను రాను ఎక్స్ పోజింగ్ లు..లిప్ లాక్ లు అంటూ రెచ్చిపోతుంది. ఆమె లాస్ట్ నటించిన రౌడి బాయ్స్ సినిమాలో అమ్మడు పర్ ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..లిప్ కిస్ లతో కుర్రాళ్లను రెచ్చకొట్టింది.

అయితే, తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన అనుపమకు అభిమానులు చుక్కలు చూయించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లింది అనుపమ. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్..సెల్ఫీల కోసం ఎగవడ్డారు. చుట్టు పక్కల జనం కూడా అనుపమను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ కొంచెం సేపు గందరగోల వాతవరణం నెలకొంది. ఇక షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటించి.. రిటర్న్ అవుతుండగా.. అభిమానులు ఒప్పుకోలేదు . ఇంకా కాసేపు ఉండాల్సిందే అంటూ అరుపులు, కేకలతో డిమాండ్ చేశారు. అయినా కానీ, అనుపమ కార్ ఎక్కి వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్న క్రమంలో కార్ టైర్ లో గాలి తీసేశారు. దీంతో కొంచెం సేపు అక్కడే ఇరుక్కుపోయింది హీరోయిన్ అనుపమ. ఆ తరువాత షాప్ యజమానులు మరో కారు తెప్పించి..ఆమెను సేఫ్ గా పంపించేశారు. ఈ విషయం పై కొందరు జనాలు అభిమానుల ఓవర్ యాక్టింగ్ ను తప్పుపడుతున్నారు. ఏం పనులు రా నాయన ఇవి ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.