సార్ కి..అంత సీన్ ఉందా..?

ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద టఫ్ ఫైట్ నడుస్తుంది. సినిమా తీయ్యడం..వాటికి ప్రమోషన్స్ చేయ్యడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు చేరిపిరాయడం మరో బిగ్ తలనొప్పులు అనే చెప్పలి. ఒకప్పుడు అంటే సినిమా రిలీజ్ అయ్యిందా..జనాలు ఎంజాయ్ చేశారా..లాభాలు వచ్చాయా ..అంతే . కానీ, ఇప్పుడు..వామ్మో ఆ సినిమా మొదలైనప్పటి నుండి ..ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ ..వ్యూస్, రికార్డ్స్..సగం గొడవలు అక్కడే స్టార్ట్ అవుతున్నాయి.

మా హీరో గొప్ప అంటే లేదు లేదు మాహీరో తోపు అంటూ..కొట్టుకు చస్తున్నారు. కానీ ఫైనల్ గా మనకు కావాల్సింది ఎంటర్ టైన్ మెంట్ అనే సంగతి మర్చిపోతున్నారు జనాలు. మా కోసం మీరు కొట్టుకోవద్దు రా అయ్యా అంటూ సినీ హీరోలు చెప్తున్నా..ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్లు అభిమానులు బీహేవ్ చేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి ఫైట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే ఇక్కడ హీరోల గురించి కాదు.. డైరెక్టర్ల గురించి.

రీసెంట్ RRR తో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్నాడు జక్కన్న..ఈ సినిమా చూసి అందరు కూడా శభాష్ అని మెచ్చుకున్నారు. సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇండియన్ సినిమా రికార్డ్స్ తిరగరాసింది. కానీ, సినిమా గురించి ఓ పెయిడ్ బ్యాచ్ పని కట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఒక సో కాల్డ్ పేరున్న వెబ్ సైట్..రాజమౌళిని కావాలనే డీగ్రేడ్ చేస్తూ.. ప్రశాంత్ నీల్ ని పొగిడుతూ.. భజన చేస్తుందంటున్నారు జక్కన్న ఫ్యాన్స్. రాజమౌళికి అంత సీన్ లేదని..ఫ్యామిలీ పేరు చెప్పుకుని..తండ్రి భార్య ల హెల్ప్ తోనే సినిమాలు హిట్ అవుతున్నాయని..బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారట.

అంతేనా..KGF ఖచ్చితంగా RRR రికార్డులని బద్దలు కొడుతుందని..ప్రశాంత్ కి ఆ దమ్ముందని డప్పు కొట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై రాజమౌళి అభిమానులు నవ్వేస్తున్నారు. KGF2 హిట్ అవుతుంది ఓకే కానీ మా RRR ని బీట్ చేసే సత్తా లేదు.. రాజమౌళి సినిమా ల ముందు ప్రశాంత్ సినిమాలు బిస్కెట్ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు అయితే రాజమౌళి కి ప్రశాంత్ తో పోలికా.. అంత సీన్ ఉందా అంటూ రెచ్చ కొట్టే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 14 న KGF2 సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఈ వార్ చూస్తుంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అయ్యేటట్లు ఉందంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి నిజంగానే KGF2 కి RRR ను బీట్ చేస్తే దమ్ము ఉందా అనేది..?