సుకుమార్ డైరెక్షన్‌లో చిరు షూట్ కంప్లీట్.. నిజమండీ బాబు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు మరో స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో ఒకసారి తెలుసుకుందామా.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. అవును.. ఇది నిజం. అయితే చిరంజీవి పూర్తి చేసింది ఏ సినిమా షూటింగ్ మాత్రం కాదులెండీ.. ఆయన తాజాగా ఓ యాడ్ కు సంబంధించిన షూటింగ్‌ను సుకుమార్ డైరెక్షన్‌లో పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో మెగాస్టార్ అభిమానులు, ఈ కాంబోలో త్వరలోనే ఓ సినిమా పడితే బాగుంటుందని కోరుతున్నారు. ఇటీవల సుకుమార్ పుష్ప చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి డైరెక్టర్‌తో మెగాస్టార్ ఓ సినిమా చేస్తే అది ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగా నిలబడుతుందని వారు కోరుతున్నారు. మరి నిజంగానే ఈ కాంబోలో ఓ సినిమా సెట్ అవుతుందో లేదో చూడాలి.