ఆచార్య లో ఆ ఒకటి మిస్..అది కనుక ఉండిఉంటే నా సామీ రంగా..అద్దిరిపోయేది..!!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూసిన ఆచార్య సినిమా ట్రైలర్ రిలీజైంది. అభిమానుల అంచనాలను డబుల్ చేస్తూ..మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో సేమ్ అచ్చు గుద్దిన్నట్లు కొరటాల దింపేశారు. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమా ఆచారయ. ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో మొదలైనా.. అనేక వాయిదాలు పడుతూ పడుతూ ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేశారు.

కానీ, దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లు.. సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా.. బాక్స్ ఆఫిస్ వద్ద ఉన్న టఫ్ ఫైట్ సినిమాల కారణంగా చిరు సినిమా వెనకి వెనక్కి పోతూ వచ్చి..ఫైనల్ గా ఏప్రిల్ 29న అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కొరాటల డైరెక్షన్ ఒక ప్లాస్ పాయింట్ అయితే.. చిరు తన కొడుకుతో కలిసి నటిస్తుండటం మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మెగా అభిమానుల కల ఈ సినిమా తో నెరవేరబోతుంది. పైగా ఈ సినిమాలో చరణ్ లుక్ అద్దిరిపోయిందంటే” సిద్ధా” అనే పాత్రలో చరణ్ చించేశాడు అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపదుతుండటంతో ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. అభిమానులను ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునే లా చేసింది. ముఖ్యంగా చరణ్ నటన బాగుంది. అంతేకాదు , చిరు నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్ బాగా పేలింది. నేను వచ్చానని చెప్పుదాం అనుకున్నా,,కానీ చేయడం మొదలెడితే..అంటూ చిరు చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో అన్ని పండించిన కొరటాల రొమాన్స్ ను మిస్ చేశాడు అన్న ఫీలింగ్ హాట్ టాపిక్ మారింది. కొరటాల సినిమాలో రొమాంటిక్ సీన్స్ బాగుంటాయి. వల్గారిటీ లేకుండా.. నవ్వుకునే లా బాగా తెరకెక్కిస్తాడు అనే పేరుంది. కానీ ట్రైలర్ లో ఎందుకో అది కనిపించలేదు. అసలు సినిమాలో అయినా ఉందా లేదా అనే డౌట్లు వస్తున్నాయి. ఏదిఏమైనా ట్రైలర్ ఒక్క రొమాంటిక్ సీసీన్ అయినా పెట్టుంటే.. నా సామీ రంగా అద్దిరిపోయుండేది అంటున్నారు నెటిజన్లు. మరి చూడాలి.. కొరటాల ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయం అందుకుంటాడో..?