పవన్ లేకుండానే మొదలెడుతున్న భవదీయుడు భగత్ సింగ్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న పవన్, మరోసారి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

భవదీయుడు భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నారట. ఇటీవల పవన్‌ను నేరుగా కలిసిన హరీశ్ ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ కనిపించడట. పవన్ లేకుండా భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు హరీశ్ శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. భారీ తారాగణం ఉండబోతున్న ఈ సినిమాలో పవన్ పాత్ర సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఎప్పుడు పాల్గొంటాడనేది ఇంకా తెలియాల్సి ఉంది.