తెలుగోడి దెబ్బ: బన్నీని అవమానించినందుకు..యాష్ ను కడిగేసిన రిపోర్టర్లు..!!

యస్..ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే అంటున్నారు అందరు. ఒకప్పుడు కన్నడ గడ్ద పై అల్లు అర్జున్ ను అవమానించినందుకు ఇప్పుడు అదే విధంగా తెలుగు గడ్డ పై కన్నడ స్టార్ హీరో యాష్ ను పక్కగా ఆడుకున్నారు రిపోర్టర్లు. అసలు ఏం జరిగిందంటే.. అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా టైం లో వాళ్ళకు ప్రమోషన్స్ చేయడానికి టైం ఎక్కువుగా లేదు. దాంతో పాపం..సుకుమార్ ఓ వైపు.. రష్మిక-బన్నీ మరో వైపు ప్రవైట్ జెట్ ప్లేన్స్ లో వీలైనంత ఎక్కువుగా తమకు తగ్గ రేంజ్ లో బాగానే ప్రమోషన్స్ చేశారు..సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

అయితే, కన్నడ గడ్డ పై సినిమా ప్రమోషన్స్ కు వెళ్లిన బన్నీ.. అక్కడి రిపోర్టర్..”మీరు ప్రెస్ మీట్ చెప్పిన టైం ఏంటి.. మీరు వచ్చింది ఎన్ని గంటలకు. మీ కోసం మేము టైం వేస్ట్ చేసుకోవాలా..మీలాగే మాకు టైం చాలా ఇంపార్టెంట్”అంటూ చిందులు వేశాడు. దానికి అల్లు అర్జున్ “సారీ, నాకు నిజంగా తెలియదు .. మాకు చాలా తక్కువ టైం ఉంది..అందుకే ఇలా ఫాస్ట్ గా ప్రెస్ మీట్ లు పెడుతున్నం. నా వల్ల మీ టైం వేస్ట్ అయ్యినందుకు..సారీ, నన్ను క్షమించండి..” అంటూ కూల్ గా మ్యాటర్ సాల్వ్ చేశాడు.

kgf2
kgf2

కాగా సరిగ్గ , సేమ్ టూ సేమ్ అలాగే జరిగింది యాష్ కి. ఆయన హీరో గా నటిస్తున్న KGF2 ఏప్రిల్ 14న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నే ఫాస్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేస్తున్నారు యాష్ . ప్రమోషన్స్ లో భాగంగా యాష్..కేజీఎఫ్-2” టీం తిరుపతి ప్రెస్ మీట్ ఉదయం 7 గంటలకు అని చెప్పి, 8.30 గంటలకు వచ్చారు. వైజాగ్ లో మధ్యాహ్నం 11 గంటలకు అని చెప్పి… 12.30కు వెళ్లారు. దీంతో తెలుగు మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక మన్ రిపోర్టర్లు యాష్ ను అడిగి కడిగి పారేసారు.. మా టైం వేస్ట్ అయ్యింది..చెప్పిన టైంకి రాలేరా..అంటూ అడగ్గా..యాష్ కూడా నాకు తెలియదు..వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వెళ్తున్నా.. మావి ప్రైవేట్ జెట్స్ కదా పర్మీషన్ దొరకదు..సో లేట్ అయ్యింది.. రెండు నిమిషాలు లేట్ అయిన అది తప్పే సారీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ రెండు వీడియోలను మ్యాచ్ చేస్తూ..తెలుగోడి దెబ్బ అంటూ ట్రోలర్స్ యాష్ ని ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.