హమ్మయ్య..ఎట్టకేలకు ర‌ష్మిక క‌ల నేరవేరింది..ఆల్ హ్యాపీస్..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ..చూసేందుకు చక్కగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ..చల్ చల్ ఛల్లో అంటూ పోతూనే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన్ అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు, బన్నీ, లాంటి స్టార్స్ పక్కన నటించే అవకాశం కొట్టేసి..పాన్ ఇండియా సినిమాలకు సైతం సైన్ చేస్తుంది. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటుంది లేండి.

అవకాశాలు దక్కించుకున్నట్లే ,..రెమ్యూనరేషన్ ని కూడా కోట్లల్లో డిమాండ్ చేస్తుంది. అంతేగా..దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చక్కదిద్దుకోవాలి.. ఈ ఫార్ములా కన్నడ బ్యూటీ బాగా అర్ధం చేసుకున్నట్లుంది. ప్రజెంట్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ లోను సినిమాలకు కమిట్ అవుతూ పాప ఫుల్ స్వింగ్ లో ఉంది. రీసెంట్ గా రష్మిక డ్రీమ్ కమ్ ట్రూ అయ్యిన్నట్లు తెలుస్తుంది. రష్మికకి కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే చాలా చాలా ఇష్టమట. సినిమాలోకి రాకముందు నుండే ఆయనంటే పడి చచ్చిపోతానని చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది.

ఇక రీసెంట్ గా ఆమె ఫేవరేట్ హీరో విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకుంది. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతకొంత కాలంగా చర్చల్లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా మూహుర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా నిన్నటి నుంచే మొదలుపెట్టారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ని అధికారికంగా తెలియజేశారు టీం. ఫస్ట్ ఈ సినిమాలో రష్మికనే అనుకున్నా,,ఆ తరువాత ఎందుకో దిల్ రాజు తప్పించారని మాటలు వినిపించాయి..మళ్లీ ఫైనల్ గా ఆమెనే ఫిక్స్ చేసిన్నట్లు ఉన్నారు చిత్ర బృందం . దీంతో ఆమె తన కల నిజం చేసుకుంది . ఇక పూజా కార్యక్రమాలల్లో రష్మిక విజయ్ నే చూస్తుండిపోయింది. ఆమె ఎక్స్ ప్రేషన్స్ హైలెట్ గా నిలిచాయి.