జూనియర్ ఎన్టీఆర్ కొడుకుకి ఆ హీరో అంటేనే ఇష్టమట…!!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన ఎన్టీఆర్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ మధ్యనే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో కొమురంభీం పాత్రలో నటించి అభిమానులను మెప్పించాడు. సినిమాలో మరో హీరో చరణ్ పాత్ర హైలెట్ అయినా..తారక్ పర్ ఫామెన్స్ కి కన్నీళ్లు తెప్పించ్చాడు. దీంతో మరో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ నందమూరి వారసుడు.

కాగా, ప్రజెంట్ RRR సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ టైగర్..మరికొద్ది రోజుల్లో కొరటాల శివ తో కమిట్ అయిన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తరువాత బుచ్చి బాబుతో..ఆ తరువాత ప్రశాంత్ నీల్, అనీల్ రావిపూడితో సినిమాలను లైన్లో పెట్టుకుని ఉన్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా..ఖచ్చితం తమ ఫ్యామిలీకి టైం ఇస్తారు మన తెలుగు హీరోలు. అలాంటి వారిలో తారక్ కూడా ఒకరు. టైం దొరికితే చాలా తన ఇద్దరి పిల్లలితో సరదాగా గడుపుతుంటారు.

రీసెంట్ గా RRR సక్సెస్ పార్టీలో తండ్రి తారక్ తో పాటు పెద్ద కొడుకు అభయ్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా..టక్కున మహేష్ బాబు అని చెప్పేసాడు. మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని..ఆయన నటించిన బిజినెస్ మాన్ సినిమా అంటే నాకు చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు ఈ బుల్లి నందమూరి వారసుడు. ఇంకేముంది అభయ్ మాటలకు ఫిదా అయిన మహేష్ ఫ్యాన్స్ ..తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీళ్లిద్దరి కాంబో ఓ సినిమా వస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కాంబోని కలిపే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరో..?