ఫస్ట్ ప్రభాస్‌‌ తోనే..అమ్మ బాబోయ్..నగ్నం బ్యూటీ నాటీ కామెంట్స్..!!

ప్రభాస్..అమ్మాయిల కలల డార్లింగ్ హీరో..ఆ పేరు చెబుతుంటేనే గుండెల్లో గిటార్ మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు అడుగుల హైట్ ఆ ఎత్తుకు తగ్గ బరువు..ఆ ఫిజిక్ తో ఒక్క స్మైల్ ఇస్తే.. వావ్..అమ్మాయిలు పడిపోవాల్సిందే. అంత బాగుంటాడు అబ్బాయి. కానీ ఏం లాభం పిల్లాడు పెళ్లి అంటేనే పారిపోతున్నాడు. పెళ్లి అంటే భయమో..లేక ఈ పెళ్లి వల్ల వచ్చే తలనొప్పులు నాకు వద్దురా సామీ..సింగిల్ లైఫే కింగ్ లైఫ్ అంటూ ఏక్ నిరంజన్ లా ఉండిపోతాడో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో ఈయన పెళ్లి పై వచ్చిన్నని వార్తలు మరే ఇష్యూ పై కూడా వచ్చుండవు. అంత ట్రెండింగ్ టాపిక్ ప్రభాస్ పెళ్లిదే.

కరెక్ట్ గా ఆ పాయింట్ ని పట్టుకుని పెద్ద దుమారానికే తెర లేపింది RGV నగ్నం బ్యూటీ శ్రీ రాపాక. ఆరు నెలలు కలిసి ప్రయాణం చేస్తే వాళ్లు వీళ్లు అవుతారు అని ఓ సామెత వాడుతుంటారు మన పెద్దవాళ్లు అలా..RGV తో సినిమా తీయ్యగానే ఆయన జిమ్మిక్ లు అన్ని పట్టేసిన్నట్లుంది పాప..వేయడం వేయడమే పెద్ద హీరోకి టెండర్ వేసి..నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. RGV తెరకెక్కించిన నగ్నం సినిమాతో తనలోని నగ్న నటనా టాలెంట్ ను భయటపెట్టిన ఈ బ్యూటీ..ఆ సినిమాతో తెగ పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చింది.

ఇక ఇప్పుడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ..నెట్టింట ట్రెండింగ్ గా మారింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. ప్రభాస్‌ పెళ్లి విషయమై ప్రస్తావన రాగానే రియాక్ట్ అయింది. “ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు నేను కూడా చేసుకోను. ఈశ్వర్ సినిమా నుంచే ఆయనంటే పిచ్చ ఇష్టం. చాలా బిగ్గ్ ఫ్యాన్ ని ఆయనకి. ప్రభాస్‌ని పెళ్లి చేసుకుని ఒక్కరోజు అయినా ఆయన భార్య గా బతికినా చాలు. కానీ అది ఎలాగో జరగదు..అది నాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునే వరకు నేను చేసుకోను. బై ఛాన్స్ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదా..నేను కూడా లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గానే బ్రతికేస్తా..అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ దృష్టిలో పడింది శ్రీ రాపాక. ఇప్పుడు ప్రభాస్ పెళ్లితో ఈమె పెళ్లి కూడా మూడిపడింది. ఏవయ్య ప్రభాస్ ఇది నీకు వినిపిస్తుందా..?