అబ్బా..మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్..మారవయ్యా..?

సినీ ఇండస్ట్రీలో హీరో గా రావడం గొప్ప కాదు..వచ్చిన తరువాత ఆ స్దానాని నిలుపుకుని..నాలుగు ఐదు హిట్లు ఫ్లాపులు పడ్డాక అధైర్య పడకుండా..విజయం సాధించాలని ముందుకు వెళ్ళాలి. సినీ ఇండస్ట్రీలో హిట్లు ఎవ్వడైన కొడతాదూ. కానీ, ఫ్లాప్ సినిమాలు పడిన తరువాత వచ్చే హిట్ సినిమా కిక్కు ఉంటాది చూశారా.. అబ్బో ఆ కిక్కు, ఎంజాయ్ చెప్పితే అర్ధం కాదు అనుభవించేవాడికే తెలియాలి. అలాంటి కిక్కులను ఎన్నో చూశాడు హీరో నితిన్.

జయం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఈ బుడ్డోడు..ఇప్పుడు టాప్ హీరోలల్లో ఒకరుగా నిలిచాడు. తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాలో అమాయకుడిగా కనిపించిన ఈ కుర్ర హీరో..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేటు మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని టాప్ ప్లేస్ లో ఉన్నాదు. మనం గమన్నించిన్నట్లైతే నితిన్ కెరీర్ గ్రాఫ్ లో అప్ అండ్ డౌన్ లు చాలానే ఉన్నాయి. ఒక్కసారిగా పై పైకి దూసుకుపోయిన్నట్లు ఉండే గ్రాఫ్ మరోసారి అమాంతంగా పడిపోయిన్నట్లు..కనిపిస్తుంది. ఇలా నితిన్ కెరీర్ లో చాలా నే ఉన్నాయి.

కాగా, గత కొంతకాలంగా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరైన హిట్ పడని నితిన్..ప్రస్తుతం తన రూట్ మార్చి..క్లాస్ ఇమేజ్ నుండి బయటకి వచ్చి మాస్ అవతారం ఎత్తాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నితిన్. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే కసితో ఉన్న నితిన్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నట్లు రీసెంట్ గా రిలీజైన వీడియో చూస్తుంటేనే అర్ధం అవుతుంది. కానీ, ఈ సినిమా లో నితిన్ లుక్స్ పై అభిమానులు హ్యాపీ గా లేరు అన్నట్లు తెలుస్తుంది. నీకు సెట్ అయ్యే క్లాస్ లుక్స్ ని వదిలేసి..మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నావ్ అందుకు నితిన్ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తొడ కొట్టడం..కత్తులతో నరకడం నీకు సెట్ కావు..దయచేసి ఆ మాస్ ఇమేజ్ వదిలేసి నీ క్లాస్ లుక్ స్ కి రా సామీ లేకపోతే దెబ్బైపోతావు అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. మరి చూడాలి నితిన తన అభిమానుల మాట వింటారా లేదా అనేది..?