‘ గని ‘ ట్రైలర్ …కేకపెట్టిస్తున్న వరుణ్ తేజ్ డైలాగ్స్

దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా “గని “.ఈ సినిమాకి సంబంధిచి ప్రొమోషన్స్ చిత్ర బృందం మొదలుపెట్టేసింది .ఇంతకముందు రిలీజ్ చేసిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్ .

అయితే ఈ చిత్రానికి సంభందించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం .ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది , “నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ” ‘ఆట గెలవాలంటే నేను గెలవాలి ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ గెలిసిన వాడి మాటే నమ్ముతుంది .అంటూ పంచు డైలాగ్స్ తో వరుణ్ కేక పుట్టించాడు .ఈ సినిమాలో ప్రధాన పాత్రలో జగపతి బాబు ,ఉపేంద్ర ,నదియా ,సునీల్ దత్ నటించారు .హీరోయిన్గా సయీ మంజ్రేకర్ నటిస్తుంది .