ఎన్టీఆర్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి.. వీడియో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక తారక్ ఈ సినిమాలో నటవిశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవలని తారక్ అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తారక్ ఈ సినిమా సక్సెస్‌తో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తారక్ తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా పెడుతూ వచ్చాడు.

కాగా తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, ఆయన తల్లి శాలినిలతో పాటు ఆయన కొడుకులు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తారక్ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తారక్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌ల అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అభయ్ రామ్, భార్గవ్ రామ్‌ల క్యూట్‌నెస్‌కు నెటిజన్లతో పాటు నందమూరి అభిమానులు సైతం మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ కొడుకులుగా వీరిద్దరు ఉన్నారని, మున్ముందు వీరు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడం ఖాయమని అప్పుడే జ్యోస్యం చేబుతున్నారు. ఇక తారక్ కొడుకులు తిరుమలలో కనిపించడంతో స్థానికులు వారిని తమ ఫోన్లలో బంధించేందుకు తెగ ప్రయత్నించారు. ఏదేమైనా తారక్ కొడుకులకు సంబంధించిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.

https://www.facebook.com/watch/?extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&v=1045357016044986