బాబాయ్ తో ఒక్కసారి అలా.. మనసులో మాట బయటపెట్టిన ఎన్టీఆర్..?

సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గౌరవం ఎలాంటిదో అందరికి తెలిసిందే. పెద్దాయన అలాంటి పేరు సంపాదించిపెట్టారు. తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు అటు సినిమాలోను ఇటు రాజకీయాలోను చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. అలా ఉంటాది మ్యాటర్. తప్పు చేస్తే అరవడం..మంచి చేస్తే అభినందించడం ఆయన దగ్గరనుండే కొడుకు బాలకృష్ణ కి వచ్చింది అంటారు ఆయన సన్నిహితులు.

ఇక తాత పోలికలను అచ్చు దింపుతూ ఆయన లేని లోటును భర్తీ చేస్తున్నారు యంగ్ టైగర్ తారక్. అభిమానులు ముద్దుగా జూ.ఎన్టీఆర్ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన “RRR” సినిమాలో చరణ్ తో పాటు మరో హీరోగా నటించాడు. ఈ సినిమా మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేశాడు రాజమౌళి. జక్కన్న-తారక్-చరణ్..ముగ్గురు కూడా క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా..ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

అయితే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆయనకు పలు రకాల ప్రశ్నలు ఎదురైయాయి. ఈ నేపధ్యంలోనే యాంకర్..”ప్రస్తుతం రామ్ చరణ్‌ లాంటి బడా హీరోతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న మీరు..ఛాన్స్ వస్తే ఇంకా ఎవరెవరితో ఇలాంటి భారీ మల్టీ స్టార సినిమాలు చేయాలనుకుంటున్నారు? అని అడిగిన వెంటనే తారక్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ప్రశ్నకు బదులిస్తూ వరుసగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాల బాబాయ్, అల్లు అర్జున్, మహేష్ బాబు” ల పేర్లు టకటకా అని అందరి పేర్లు చెప్పేశారట. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నందమూరి అభిమానులు కోరిక కూడా అదే. బాబాయి-అబ్బాయి ఇద్దరిని ఒక్కే ఫ్రేమ్ లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?