కేజీఎఫ్ 2 రన్‌టైమ్.. ఇది కూడానా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కేజీఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేశాడు. కాగా ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని మరిన్ని మాస్ అంశాలను జోడించి ఈసారి ప్రేక్షకులకు బిర్యానీ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. కాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ 169 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే 2 గంటల 49 నిమిషాల లెంగ్తీ రన్‌టైమ్‌తో కేజీఎఫ్ 2 మనల్ని అలరించనుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లోనూ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ కేజీఎఫ్ మేనియాలో ఊగిపోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.