ఆ యాంకర్ కి నోరు ఎక్కువ.. ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..!!

యాంకర్ సుమ..ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. గత కొన్ని ఏళ్లుగా బుల్లితెర పై తనదైన స్టైల్ లో యాంకరింగ్ లు చేస్తూ..జనాలను కడుపుబ్బ నవిస్తూ..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. నాకు లేరు పోటి నాతో నాకే పోటీ..అన్న రీతిలో ఓ వైపు బుల్లితెర పై షో లకు యాంకరింగ్ చేస్తూనే ..మరో వైపు స్టార్ హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్లని హోస్ట్ చేస్తుంది. సినిమా ఎవ్వరిదైనా యాంకరింగ్ అంటే సుమ గుర్తురావాల్సిందే..

సుమ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం వాళ్ళ సినిమా ఫంక్షన్ లో ఖచ్చితంగా ఆమె గురించి ప్రస్తావిస్తారు. స్పాంటేనియస్ గా మాట్లాడటం సుమ స్పెషాలిటి. అంతేకాదు వల్గారిటీకి దూరంగా..కామెడీ దగ్గరగా ఉండేటట్లు పంచ్ లు వేస్తూ..అందరిని ఆకట్టుకుంటుంది. అసలు ఇండస్ట్రీలో సుమ అంటే ఇష్టం లేని వారు ఉన్నారా..అనే సందేహం రాక మానదు..అలా అందరితో సర్దాగా కలిసిపోతూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది.

ఇక సుమతో ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే సుమ తో కూడా ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఏర్పడింది. కాగా,రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం సంగీత దర్శకుడు కీరవాణితో ఓ స్పెషల్ ఇంటర్వ్యు పెట్టించారు. ఈ క్రమంలో సరదాగా ముచ్చటించిన చరణ్-తారక్-కీరవాణి..సినిమా గురించి బోలెడు విషయాలు మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో యాంకర్‌ సుమ గురించి మాట్లాడుతూ..కీరవాణి ..”ఒక్కవేళ మీ సినిమాలో ఏ రోల్‌ చేయాల్సివస్తే అది సుమకి ఇస్తావు ” అని కీరవాణి తారక్ ను ప్రశ్నించగా.. ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ..” సుమకు అయితే నేను నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ రోల్‌ ఇస్తాను. ఎందుకంటే..సుమకి నోరు ఎక్కువ..చాలా చాదస్తం మనిషి, నాకు ఆమెను చూడగానే గయ్యాలి అత్త పాత్రలే గుర్తొస్తాయి అని మాట్లాడుతుండగా.. రామ్‌చరణ్‌ మధ్యలోకి ఎంటర్ అయ్యి.. సుమకు పంచాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్ర అయితే బాగుంటుంది అని “చెప్పుకొచ్చాడు. ఈ మాటలు వాళ్లు సరదాగానే అన్నారు. వాళ్ల తో సుమ కి ఉన్న చనువు అలాంటిది. మరీ చుద్దాం ఈ సినిమా సక్సెస్ మీట్ సుమ దీని గురించి స్పందిస్తుందో లేదో..?