విజ‌య్ – వంశీ పైడ‌ప‌ల్లి సినిమాలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్‌…!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ద‌ళ‌పతి విజయ్ జోసెఫ్ వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు. మాస్ట‌ర్‌తో రికార్డులు తిర‌గ‌రాసిన విజ‌య్ తాజాగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బీస్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది.

విజ‌య్‌కు గ‌తంలోనే తెలుగు మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో త‌న తెలుగు మార్కెట్‌ను మ‌రింత‌గా పెంచుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. బీస్ట్‌ను త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ త‌న కెరీర్‌ల 66వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమాతో విజ‌య్ నేరుగా తెలుగులో అడుగు పెట్ట‌నున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజ‌య్ ప‌క్క‌న హీరోయిన్లుగా టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోయిన్లుగా ఉన్న ర‌ష్మిక మంద‌న్న – పూజా హెగ్డేల‌ను లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆల్రెడీ విజ‌య్ ప‌క్క‌న బీస్ట్‌లో పూజ హీరోయిన్‌గా న‌టించింది. ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో విజ‌య్ అంటే మామూలు ర‌చ్చ ఉండ‌దు..!


Leave a Reply

*