టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మరో విడాకులు జరగబోతున్నాయా?

సినిమా ఇండస్ట్రీకి విడాకుల ఫీవర్ పట్టుకుందా అంటే.. అందరి సమాధానం అవును.. ఇటీవలి కాలంలో దంపతులుగా కలిసుండటానికి మాత్రం ఎవరూ ఇష్టపడటం లేదు. విడిపోయి ఎవరి దారిలో వారు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇలాకొన్ని రోజుల ముందు వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన సెలబ్రిటీలు.. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్స్ గా ఉన్న నాగచైతన్య సమంత విడాకుల అంశం హాట్ టాపిక్గా మారిపోయింది.

 

వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకున్నారా లేకపోతే అభిమానులందరికీ ఏదైనా ప్రాంక్ చేశారా అని కొన్ని రోజులపాటు అభిమానులందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం మరింత షాకింగ్ గా మారిపోయింది. దాదాపు 18 ఏళ్ళ వైవాహిక బంధానికి గుడ్బై చెప్పేశారు ఇద్దరు. ఇక ఇప్పుడు మరో విడాకులు అంశం తెరమీదకి వచ్చింది. బాలీవుడ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ నటుడిగా తన హవా నడిపించిన వ్యక్తి విడాకులకు సిద్ధమైనట్లు ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

50 ఏళ్ల వయసు పైబడిన అతను విలన్ గా కెరీర్ ప్రారంభించాడు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. 40 ఏళ్ళ వయస్సులో వర్ధమాన నటిని ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. అతనికి పెళ్లి దాదాపు ఆరేళ్ల అవుతుంది. ఇక భార్యాభర్తలిద్దరికీ పొసగక పోవడంతో చివరికి విడాకులు తీసుకొవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడట ఆ నటుడు. ఇలా మరికొన్ని రోజుల్లో ఓ సీనియర్ నటుడు విడాకులతో అందరికీ షాక్ ఇవ్వబోతున్నాడు అంటూ టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Share post:

Latest