గెహ్రైయాన్ ప్ర‌మోష‌న్లలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఇష్టాన్ని బ‌య‌ట పెట్టిన దీపికా..!

బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్ల‌లో దీపికా ప‌దుకొనే కూడా ఒక‌రు. పెళ్ల‌యినా కూడా దీపిక క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పుడు కూడా ఆమె హాట్ హాట్ రోల్స్‌తో బాలీవుడ్ కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారిపోయింది. దీపిక‌ను కొద్ది రోజుల నుంచి టాలీవుడ్‌లో న‌టింప‌జేసేందుకు చాలా మంది ట్రై చేశారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ప్రాజెక్ట్ కె సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది.

ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో గెహ్రెయాన్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె యంగ్ హీరో సిద్ధాంత్ చ‌తుర్వేదితో క‌లిసి న‌టిస్తోంది. ఘాటైన రొమాన్స్ పండించింది. ఈ సినిమా స్టిల్స్‌, ట్రైల‌ర్లు చూసిన వాళ్ల‌కు మ‌తులు పోతున్నాయి. అస‌లు దీపికాయేనా ? ఆమెకు పెళ్ల‌య్యిందా ? అన్న సందేహాలు వ‌చ్చేంత‌గా ఘాటైన రొమాన్స్‌తో అల్లుకుపోయింది. మ‌రి కొంద‌రు అయితే ఆ రొమాన్స్ చూసి నోరెళ్ల బెట్ట‌డంతో పాటు అమ్మా ఈ రొమాన్స్ చేయ‌డానికి నీ భ‌ర్త ప‌ర్మిష‌న్ తీసుకున్నావా ? అని అడ‌గ‌డంతో ఆమె ఒళ్లు కూడా మండిపోయింది.

ఇదిలా ఉంటే గెహ్రైయాన్ ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటోన్న దీపిక జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఏ హీరోతో సినిమా చేయ‌లేదు ? ఏ హీరోతో చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారో ? అన్న ప్ర‌శ్న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు చెప్పింది. జూనియ‌ర్ అద్భుత‌మైన వ్య‌క్తి అని.. భ‌విష్య‌త్తులో తాను జూనియ‌ర్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నాన‌ని .. ఎన్టీఆర్‌పై త‌న అవాజ్య‌ప్రేమ బ‌య‌ట పెట్టింది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపుతున్నాయి. టాలీవుడ్ రేంజ్ పెర‌గ‌డంతో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు కూడా టాలీవుడ్ హీరోల‌తో క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మ‌రి దీపిక – ఎన్టీఆర్ జోడీ కాంబినేష‌న్లో ఎప్పుడు సినిమా సెట్ అవుతుందో ? దీపిక కోరిక ఎప్ప‌ట‌కి నెర‌వేరుతుందో ? చూడాలి.


Leave a Reply

*