బాగా బుద్ధొచ్చింది..ఈసారి ఆ తప్పు చేయను అంటున్న నాగార్జున..?

అక్కినినేని నాగార్జున టైం బాగుందా..బాగోలేదా అస్సలకి అర్ధంకావడంలేదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..తన బిడ్డల భవిష్యత్తు విషయంలో ప్రతి తండ్రికి కొన్ని కలలు ఉంటాయి. అవి నెరవేరకపోతే.. ఏ తండ్రికి అయినా బాధ ఉంటుంది. ఇందుకు నాగార్జున ఏం మినహాయింపు కాదు. తన ఇద్దరి కొడుకుల భవిష్యతు పై నాగార్జున కు ఎంతో దిగులు ఉండేది. మిగతా హీరో కొడుకులు అంతా పాన్ ఇండీయా సినిమాలని..100కోట్ల క్లబ్ అని దూసుకుపోతుంటే..అక్కినేని వారసులు మాత్రం ఇంకా 40,50 కోట్ల దగ్గర ఉండిపోయారు.

పోని అటు పరసనల్ లైఫ్ అయినా బాగుందా అంటే అది లేదు. నాగ చైతన్య ఏమో భార్యకు విడాకులిచ్చి సింగిల్ లైఫే కింగ్ అంటుంటే.. చిన్నోడు అఖిల్ ఏమో..నిశ్చితార్ధం చేసుకున్నాక బ్రేకప్ చెప్పేసుకుని..మిస్టర్ మజ్ఞు అంటూ టైం సాగాదీస్తున్నాడు. ఇక ఇంట్లో ఇద్దరు కొడుకులు సింగిల్ గా ఉంటే ఆ తండ్రి పడే బాధ వర్ణాతీతం. అటు సినిమాల్లో సక్సెస్ కాలేక ..ఇటు వివాహ బంధాని నిలుపుకోలేక ..అక్కినేని వారసులు నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.

నాగార్జున ఎవ్వరిని మిట్ అయినా సరే కొడుకుల పెళ్లి విషయాలు గుర్తు చేసి బాధపెడుతున్నారట. పక్క మనిషి బాధపడుతుంటే ఆ బాధను గుర్తు చేసి మనం నవ్వుకోవడం మానవ గుణం. ఏం చేద్దాం..తరాలు మారుతున్నా..కానీ ఈ అలవాట్లు మాత్రం మానడం లేదు. దీంతో నాగ్.. పిల్లాడికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యిపోయారట. నాగ చైతన్య కి ఇంకా అఫిషియల్ గా విడాకులు రాలేదు సో..చట్టబద్ధంగా అది నేరం. నాగార్జునకి అది తెలుసు. అందుకే ..చిన్న కోడలు పిల్లని వెతుకుతున్నారట. గత రెండు సంబంధాలు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళను సెలక్ట్ చేసుకుని..పొరపాటు చేసాను అని భావిస్తున్న నాగ్..ఈ సారి మాత్రం ఆ తప్పు చేయడట. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండే అమ్మాయిని అఖిల్ కోసం వెతుకుతున్నారట. మరి చూడాలి ఈసారి అయిన అఖిల్ పెళ్లి పీఠలు ఎక్కుతారో లేదో ..?

Share post:

Latest