క్రికెటర్స్ తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్ లు కానీ హీరోలు కానీ కేవలం ఇండస్ట్రీ లో ఉండే వాళ్లను మాత్రమే వివాహం చేసుకోవాలన్న రూలేమీ లేదు. తమ మనసుకు నచ్చినవారి తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత వేరే వాళ్ళని వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇదిలా ఉండగా క్రికెటర్ ల తో ఎఫైర్ పెట్టుకున్న ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆ క్రికెటర్స్ మాత్రం మరొకరిని ను వివాహం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఎవరెవరు క్రికెటర్స్ మన స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నారో వారి గురించి మనం చదివి తెలుసుకుందాం..

- Advertisement -

1. ఇమ్రాన్ ఖాన్ :
పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ అప్పట్లోనే బాలీవుడ్ స్టార్ సెక్సీ సింబల్ గా గుర్తింపు తెచ్చుకున్న జీనత్ అమన్ తో అప్పట్లో ఎఫైర్ పెట్టుకున్నాడని డేటింగ్ కూడా చేశాడు అని అందరికీ తెలిసిన విషయమే.

2. రవి శాస్త్రి:
ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర తిరగరాసిన ఈయన క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు బయట కూడా చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ఇకపోతే ఈయన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ తో చాలా కాలం ఎఫైర్ నడిపాడు. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయి వేరే భాగస్వాములను వెతుక్కున్నారు.

3. అజారుద్దీన్ :
స్టైలిష్ హైదరాబాది ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజారుద్దీన్ సంగీత బిజిలాని అందానికి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అయితే కొద్ది రోజులు ఈమెతో ఎఫైర్ నడిపినప్పటికీ చివరికి ఈమెనే వివాహం చేసుకున్నాడు.

4. యువరాజ్ సింగ్ , ధోని:
ప్రముఖ ఇండియన్ క్రికెటర్ లుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరితో దీపిక పదుకొనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడిపింది. కానీ వీరు చివరికి వేరొకరికి ఫిదా అయిపోయారు.

5. విరాట్ కోహ్లీ:
విరాట్ కోహ్లీ ప్రముఖ స్టార్ హీరోయిన్లు అయినటువంటి తమన్నాతో పాటు మరికొంత మంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. కానీ చివరికి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో ఎఫైర్ పెట్టుకొని చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.

Share post:

Popular