ఆ హీరోలను తృప్తిపరచడానికి హీరోయిన్స్ అలా చేసేవారా..?

January 10, 2022 at 9:18 pm

అప్పట్లో హీరోలకు హీరోయిన్లకు మంచి సాన్నిహిత్యం ఉండేది.. అంతేకాదు వారిని ఇంప్రెస్ చేయడానికి హీరోయిన్లు దేనికైనా వెనుకాడరు అనే వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపించేవి.. ముఖ్యంగా ఎంజీఆర్ – జయలలిత, ఎన్టీఆర్- సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు – వాణి శ్రీ లాంటి హీరోయిన్లు హీరోలను ఇంప్రెస్స్ చేయడానికి ఏమైనా చేయడానికి వెనుకాడే వారు కాదు అని వార్తలు వినిపించేవి.. ఇకపోతే మన స్టార్ హీరోయిన్లు ఆ స్టార్ హీరోలను తృప్తిపరచడానికి ఎలాంటి పనులు చేశారో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఎంజీఆర్ – జయలలిత:
ఎంజీఆర్ కు బీఫ్ మాంసం అంటే చాలా ఇష్టమట.. కానీ జయలలిత పూర్తిగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారే అయినప్పటికీ ఆయనను ఇంప్రెస్స్ చేయడానికి స్వయంగా ఆమె బీఫ్ మాంసం వండి మరీ ఎంజీఆర్ చేత తినిపించిందట. ఇక నేను తినను కానీ ఆయనకు వండి పెడతాను అని చెప్పింది జయలలిత..

చిరంజీవి – రాధిక:
అభిలాష సినిమా చేసేటప్పుడు చిరంజీవికి, రాధికకు అస్సలు పడేది కాదట. వీరిద్దరికీ ఎప్పుడు గొడవ వచ్చేది. కానీ అభిలాష షూటింగ్ సమయంలో చిరంజీవి ఎత్తయిన ప్రదేశం నుంచి దూకాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవి ఫ్యాంట్ బటక్స్ దగ్గర పూర్తిగా చిరిగిపోయింది. కానీ రాధిక, చిరంజీవి పరువు పోతుందని తన పైట కొంగుతో ఆ చిరిగిన చోటున కవర్ చేసి కిందకు తీసుకెళ్ళింది.

ఏఎన్ఆర్ – వాణిశ్రీ:
ఏఎన్నార్ కు ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినప్పుడు వాణిశ్రీ వారానికి రెండు రోజులు చేపల పులుసు చేసి మరి తెచ్చి ఇచ్చిందట. అప్పట్లో ఏఎన్ఆర్ భార్య అన్నపూర్ణమ్మ కు చేపల పులుసు వండటం రాదా.. వాళ్ళ ఇంట్లో పని మనిషి లేరా ..అనే అనుమానాలు వచ్చినా అతని ని ఇంప్రెస్ చేయడానికి మాత్రం వాణిశ్రీ ఇలా వండి పెట్టిందట.

ఇకపోతే హీరోయిన్లు , హీరోలకు మద్యం ఎక్కువై కింద పడిపోతే వారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి వదిలి పెట్టే అంత చనువు కూడా తీసుకుంటున్నారు. ఒకసారి రాణా, త్రిష విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇదంతా ఎందుకు అని అడిగితే సినిమాలలో వాళ్లు కలిసి నటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం కూడా అంతే పెరుగుతుంది ..ఇదంతా కేవలం స్నేహం మాత్రమే అని చెబుతారు సినిమా పండితులు.. కానీ నిజానిజాలు మాత్రం అందరికీ తెలుసనే చెప్పాలి.

ఆ హీరోలను తృప్తిపరచడానికి హీరోయిన్స్ అలా చేసేవారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts