నిర్మాత కోరిక తీర్చిన సూపర్ స్టార్ కృష్ణ..

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణది ఓ ప్రత్యేక శైలి. అద్భుత సినిమాలు చేయడమే కాదు.. ఆపద సమయంలో నిర్మాతలకు అండగా నిలిచిన మంచి మనిషి ఆయన. ఆయన మూలంగా ఏ నిర్మాత కూడా ఏనాడు ఇబ్బంది పడలేదు అంటారు సినీ జనాలు. పడలేదు అనడం కంటే పడకుండా కాపాడాడు కృష్ణ అని చెప్తారు. సినిమా ఆడకపోతే.. తన రెమ్యునరేషన్ పూర్తిగా వెనక్కి ఇచ్చిన సందర్భాలున్నాయట. ఒకవేళ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వకపోతే.. వారితో మరో సినిమా ఉచితంగా చేసేవాడట. అయితే ఓ నిర్మాతకు చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండేదట. ఆ విషయం కృష్ణకు తెలిసింది. దీంతో కృష్ణతో పాటు శ్రీదేవి కూడా ఆ నిర్మాతకు అండగా నిలిచారట. వారి సాయంతో సదరు నిర్మాత సొంత ఇల్లుతో పాటు సినిమాల కోసం అమ్ముకున్న పొలం కూడా తిరిగి కొనుక్కున్నారట. ఇంతకీ వీరు సాయం చేసిన నిర్మాత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన సినమామామా అల్లుళ్ళ సవాల్. ఈ సినిమాలో కృష్ణకు అక్కగా అలనాటి మేటి నటి జమున కూడా నటించింది. జమున భర్తగా కైకాల సత్యనారాయణ చేశారు. ఆయన కూతురుగా శ్రీదేవి యాక్ట్ చేసింది. ఈ సినిమా నిర్మాత సొంత ఇల్లులేక ఇబ్బంది పడుతున్న విషయం కృష్ణకు తెలిసింది. ఈ విషయాన్ని ఈ సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటులకు కూడా చెప్పాడు. ఎలాగైనా నిర్మాత కోరిక తీరేలా చేయాలన్నారు. అనుకున్నట్లుగానే దర్శకుడు సహా మిగతా నటీనటులంతా తమ రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నారట.

అటు సత్యనారాయణతో నా పేరే భగవాన్ అనే సినిమాను కుదరవల్లి సీతారామమూర్తి అనే ప్రొడ్యూసర్ సినిమా తీశాడు. సినిమా బాగున్నా.. నిర్మాతకు డబ్బు రాలేదు. దీంతో తన సొంత ఊరిలోని ఇల్లు కట్టుకోవాలన్ని కోరిక తీరలేదట. ఈ విషయాన్ని కృష్ణకు సత్యనారాయణ చెప్పాడట. ఆయన మాటలు విని మామా అల్లుళ్ల సవాల్ సినిమాకు కృష్ణ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. నిర్మాత కోరిక తీర్చాడట.