బంగార్రాజు సినిమా కథకు ఎన్నేండ్ల సమయం పట్టిందో తెలుసా?

బంగార్రాజు.. అక్కినేని నాగార్జున, ఆయన కొడుకు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా మూవీ. ఒక సినిమాను తెరకెక్కించాలంటే చాలా సమయం పడుతుంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఓకే అయ్యాక, లొకేషన్స్, షూటింగ్ చాలా అంశాలుంటాయి. ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా కథలుంటాయి. అన్ని సక్రమంగా అయితేనే సినిమా అనుకున్న సమయంలో జనాల ముందుకు వస్తుంది. అయితే బంగార్రాజు సినిమా విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అవేంటంటే.. ఈ సినిమా కథ కోసం ఏడు సంవత్సరాలు పడితే.. దాన్ని తెరకెక్కించేందుకు మాత్రం కేవలం కొద్ది నెలలు మాత్రమే పట్టిందట. 2016లో సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన సినిమా విడుదల అయ్యింది. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది. అప్పుడే బంగార్రాజు బేసిక్ కథ అనుకున్నారు.

 

ఈ సినిమాకు సంబందించిన సీక్వెల్ ను వీలైనంత త్వరగా చేయాలి అనుకున్నారు. అదే ఏడాది బంగార్రాజు గురించి ఓ ప్రకటన చేవారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పక్కాగా రాకపోవడంతో చాలా ఏండ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు ఏకంగా ఆరు సంవత్సరాల సమయం పట్టింది. ఈ సినిమా కథ రాస్తూనే దర్శకుడు కల్యాణ్ క్రిష్ణ, నాగా చైతన్యతో కలిసి రారండోయ్ వేడుక చూద్దా, రవితేజతో నేల టిక్కెట్టు సినిమాలు తీశాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ పలు రకాల వెర్షన్లు మార్చి మార్చి రాసి చివరకు బంగర్రాజు స్ర్కిప్ట్ ఓకే చేశాడు. ఈ సినిమాకు గతేడాది నాగార్జున ఓకే చెప్పాడు. దీంతో కేవలం నాలుగు నెలల్లో ఈసినిమాను కంప్లీట్ చేశారు.

2021 జూలైలో షూటింగ్ మొదలు పెట్టారు. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగాయి. అనుకున్నట్లుగానే సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.