సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాలీవుడ్ క్రేజీ గాసిప్స్ ఏంటంటే..

January 11, 2022 at 12:00 pm

టాలీవుడ్.. ప్రస్తుతం దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల కంటే దుమ్మురేపుతన్న ఇండస్ట్రీ. ఇక్కడి సినిమాలన్నీ పాన్ ఇండియన్ రేంజిలో సంచలనం కలిగిస్తున్నాయి. చాలా మంది హీరోలు సైతం పాన్ ఇండియన్ సినిమాలనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అటు దేశ వ్యాప్తంగా టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు సినీ అభిమానులు. అటు ఆయా సినిమా పరిశ్రమలకు చెందిన దర్శకులు, ప్రొడ్యూసర్లు ఇక్కడి హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వేరే సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తాజాగా టాలీవుడ్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 

డైరెక్టర్ పరుశురాం ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు హీరోలు ఈ సినిమాలు నటిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ఈ సినిమా అనంతరం ముగ్గురు స్టార్ హీరోలతో భారీ సినిమాను ప్లాన్ చేసినట్ల తెలుస్తోంది. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో పరుశురాం చెప్పాల్సిందే..

అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య రూ. 10 కోట్ల తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న తన తాజా మూవీ కోసం ఏకంగా రూ. 22 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. అటు రాంచరణ్ వరుస సినిమాలను చేస్తున్నాడు. శంకర్, ప్రశాంత్ నీల్, సుకుమార్ సహా పలువు టాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత గౌతమ్ తిన్నసూరితో కలిసి ఓ సినిమా, శ్యామ్ సింగ రాయ్ సినిమా దర్శకుడు రాహుల్ తో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాలీవుడ్ క్రేజీ గాసిప్స్ ఏంటంటే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts