చనువుగా మాట్లాడితే పడుకోమన్నాడు: షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..

January 12, 2022 at 12:04 pm

భారత సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల పై ప్రముఖ సీనియర్ నటి రాగిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ధారావాహికలలో అమ్మ పాత్రలో, భార్య పాత్రలో ఎక్కువగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రాగిని గురించి సినీ చిత్ర పరిశ్రమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇన్నోసెంట్ మరియు సెంటిమెంటల్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతే కాదు అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.. కానీ ఎందుకో తెలియదు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఈమె సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.

కానీ సీరియల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాగిని.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీ లో ఉండే లైంగిక వేధింపుల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉండేవని కానీ కాస్టింగ్ కౌచ్ సమస్య బారిన పడినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు.. సినీ పరిశ్రమలో మన కెరియర్ ను నిర్ణయిస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు కేవలం నటన, ప్రతిభ ఉంటే సరిపోదు అని ఇండస్ట్రీ లో ఉండే వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను తెలిసినప్పుడు సక్సెస్ అవుతామని ఆమె తెలిపింది.

తాను తోటి నటీనటులు ఎవరైనా కనిపించినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చెబుతాను అంటూ తెలిపింది..ఎదుటి వాళ్లతో భుజం భుజం రాసుకొని మాట్లాడితే కొంతమంది ఏకంగా సాయంత్రం ఖాళీగా ఉన్నావా ..రాత్రి కి వస్తావా.. అంటూ పడకగది కమిట్మెంట్ అడుగుతారని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు తను కూడా సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ , వాటిని పెద్దగా పట్టించుకోలేదని, అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని దూరంగానే పెట్టానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకోకుండా ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆ అబ్బాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది.

చనువుగా మాట్లాడితే పడుకోమన్నాడు: షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts