బాలకృష్ణతో త్వరలో సినిమాపై రాజమౌళి స్పందన ఇదే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు రాజమౌళి. కేవలం హిట్ సినిమాలను తెరకెక్కించడంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఈ దర్శక దిగ్గజం. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే మరో అద్భుత సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అన్న దానిపై ప్రస్తుతం ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

ముఖ్యంగా పవర్ఫుల్ హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ.. పవర్ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని నందమూరి అభిమానులతో పాటు అటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఎక్కడ చూసినా గత కొంత కాలం నుంచి దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable కార్యక్రమానికి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా బాలయ్య రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించిన ప్రశ్న తలెత్తింది.

 

బాలకృష్ణతో సినిమా కావాలి అంటు నా అభిమానులు అడిగితే నన్ను క్యాండిల్ చేయలేనని చెప్పారట కదా ఎందుకు అంటూ బాలకృష్ణ రాజమౌళి ని ప్రశ్నించాడు. నేను ఒకసారి సెట్ లోకి వచ్చిన తరువాత అక్కడున్నది స్టార్ హీరోనా చిన్న హీరోనా అని పట్టించుకోనని… కాస్త చిరాకు గా ఉంటానని..మీరేమో అందరికీ గౌరవం ఇస్తూ ఉంటారు. దీంతో మిమ్మల్ని హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనే భయం ఉంటుంది. అందుకే సినిమా చేయలేదు అంటూ సమాధానం చెప్పారురాజమౌళి. ఇక ఇటీవలే మరోసారి మీడియా ఇలాంటి ప్రశ్న అడిగింది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న బాలకృష్ణ తో సినిమా చేయాలనే ఆలోచన ఉందా అంటూ అడగడంతో.. ప్రతి దర్శకుడికి ప్రతి హీరోతో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.