శ్యామ్ సింగరాయ్..మూవీ లో ఇంత మంచి సీన్ ని డిలీట్ చేయడానికి గల కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. కానీ ప్రస్తుతం వరుస సినిమా ప్లాపులతో సతమతం అవుతుంటే..తాజాగా నటించిన చిత్రం శ్యాము సింగరాయ్.. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు నాని.. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన తెలుగుతోపాటు.. ఇతర భాషలలో సైతం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించడం జరిగింది.

ఇందులో కథానాయకిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటించడం జరిగింది. తాజాగా ఈ సినిమా ఓటిటి లో విడుదల కావడం జరిగింది.. ఇక ఓటిటి లో కూడా ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపించారు. అయితే థియేటర్ లో విడుదల చేసిన సినిమాను ఓటీటీ లో చూసిన సినిమా లో కొన్ని సన్నివేశాలను డిలీట్ చేయడం జరిగింది.. కానీ తాజాగా యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమా యూనిట్ సభ్యులు ఆ సీన్ ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతుంది. ఇక ఆ సీన్లో శ్యామ్ సింగరాయ్ వేశ్యలతో ఓ ఇంట్లో ఉండి వాళ్లను మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అదే ఇంట్లో ఉన్న ఒక వేశ్య*తున్నావు కదా.. నన్ను వివాహం చేసుకుంటావా అని శ్యామ్ సింగరాయ్ ని ప్రశ్నించింది. దానికి శ్యామ్ సింగరాయ్ స్పందిస్తూ కచ్చితంగా చేసుకుంటాను కానీ నేను ప్రేమించినప్పుడు అంటూ సమాధానం ఇస్తాడు.. అయితే సీన్ చాలా బాగుందని అనవసరంగా డిలీట్ చేశారు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సీన్ కట్ చేయకుండా ఉంటే సినిమాకి హైలెట్ గా నిలిచిందని మరికొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీ లోనే మంచి రెస్పాన్స్ లభిస్తోంది.. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకులను మైమరపించెలా ఉంది అన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. అయితే మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసేయండి..