నాని, తమన్ కి మధ్య ఏంటి గొడవ.. అసలేమైందంటే..!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తమన్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హీరో నానిని ఉద్దేశించే ఈ కామెంట్ చేశాడని నాని ఫ్యాన్స్ తమన్ పై ఫైర్ అవుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. ఇటీవల నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని మాట్లాడుతూ మ్యూజిక్, బీజీఎం, సినిమాటోగ్రఫీ వంటి అన్ని క్రాఫ్ట్ లు కలిసి బాగా పని చేస్తేనే సినిమా బాగుంటుందని లేదంటే, లోపం తలెత్తుతుందని అన్నాడు.

అయితే నాని ఈ వ్యాఖ్యలు తమన్ ను ఉద్దేశించి అన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు వచ్చింది. పాటల కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది. అయితే నాని ఈ సినిమాను ఉద్దేశించే తమన్ పై కామెంట్స్ చేశాడని ప్రచారం జరిగింది. నాని నిజంగా తమన్ ను ఉద్దేశించి అన్నాడో లేదో తెలియదు కానీ నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

కాగా తమన్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. అందులో అన్ని క్రాఫ్ట్ లు కలిసి పనిచేస్తేనే ఒక సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా దేనిని డామినేట్ చేయదని చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే తమన్ ఈ పోస్ట్ చేశాడని ప్రచారం జరుగుతోంది.

నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో గోపీసుందర్ సంగీతం అందించాడు. అయితే అప్పటి నుంచి నానికి, తమన్ కు మధ్య దూరం పెరిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం తమన్ నాని పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.