కోపంతో ఊగిపోతూన్న మంగ్లి.. అసలు విషయం ఏమిటంటే..!

December 28, 2021 at 3:09 pm

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అటు వెండి తెరపై, బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఇక మంగ్లీ ఏ సినిమాలో అయినా సరే పాట పాడిన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈమె పాడిన పాట బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది.

Mangli Singer: Age, Wiki, Biography | FilmiFeed

ఇక ఈమె పాటలు ఒక్కోసారి వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలోనే మంగ్లీ పాడిన ఒక భక్తి పాట పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై తన సున్నితంగానే స్పందించింది. అయితే తాజాగా ఇప్పుడు మరొక సారి మళ్ళీ వార్తల్లోకి నిలిచింది మంగ్లీ. ఏదో షూటింగ్ సెట్లో కి వచ్చినప్పుడు.. ఆమె అభిమానులు తాకిడికి తట్టుకోలేక అసహనంతో.. వారి ఫోన్లను పగలగొట్టు అని అంటూ తన స్టాఫ్ కి తెలియజేసింది..

ఇదే క్రమం లోనే తన అసిస్టెంట్ మీద చేయి చేసుకున్నట్లు గా కనిపిస్తోంది. బండి కి ఫోన్ చేయరా దరిద్రుడా అంటూ అరిచేసినట్లు కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.అయితే ఈమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

కోపంతో ఊగిపోతూన్న మంగ్లి.. అసలు విషయం ఏమిటంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts