స‌ల్మాన్‌తో జెనీలియా మాస్ డ్యాన్స్..ఇద్ద‌రూ కుమ్మేశారుగా!(వీడియో)

జెనీలియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సత్యం` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అనాతి కాలంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించిన జెనీలియా.. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన జెనీలియా.. సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫాలోయింగ్‌ను రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే.. నిన్న బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జెనీలియా ఆయ‌న‌కు నిన్న బ‌ర్త్‌డే విషెను తెలియ‌జేసింది.

`పెద్ద మనసున్న సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం, ప్రేమ, చక్కటి ఆరోగ్యంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఆజ్ భాయ్ కా బర్త్‌డే హై` అని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొంటూ జెనీలియా ఓ వీడీయోను పోస్ట్ చేసింది.

ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఈ వీడియోలో ఏముందంటే.. సల్మాన్ ఖాన్, జెనీలియా కలిసి ఊర మాస్ స్టెప్పులు వేస్తూ కుమ్మేశారు. వీరిద్ద‌రి డ్యాన్స్ అభిమానుల‌నే కాదు నెటిజ‌న్ల‌నూ తెగ ఆక‌ట్టుకుంటోంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరూ స‌ల్మాన్‌-జెనీలియా డ్యాన్స్ వీడియో ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/p/CX_NuZBJRVg/?utm_source=ig_web_copy_link