రవితేజ..71మూవీ టైగర్ నాగేశ్వరరావు..అప్డేట్..!

మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఎంతటి ఘన విజయం అందుకొన్నాడు మనకు తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు రవితేజ మరో ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా రవితేజ మరొక సినిమాను కూడా అనౌన్స్ చేయడం జరిగింది.

ఆ సినిమానే”టైగర్ నాగేశ్వరరావు” ఈ పేరుతో సినిమా టైటిల్ లో మాస్ మహారాజా అనౌన్స్ చేశారు. ఈ సినిమా పేరు మోసిన ఒక గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ , మలయాళంలో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కేవలం కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కాలికి కడెం కనిపిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను విడుదల చేసారు.

https://www.instagram.com/p/CVzcjLQsi-6/?utm_source=ig_embed&ig_rid=0703dd4e-5060-4566-8e21-b15ed32f155b

Share post:

Latest