దసరా చేసుకోనంటున్న సమంత.. సెకండ్ హ్యాండ్ అయినందుకేనా?

టాలీవుడ్ స్టార్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతలు తమకంటూ ప్రేత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ స్టార్ కపుల్ తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ కపుల్ మాత్రం తమ దారులు వేరుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇక వారివారి పనుల్లో బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఈ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కొత్త ప్రాజెక్టులను ఇప్పటికే ఓకే చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే వచ్చే ‘దసరా’ను తాను చేయలేనని చెప్పేస్తోంది సమంత. ఇంతకీ సమంత ‘దసరా’ చేయలేకపోవడం ఏమిటి? అని అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏమిటంటే.. నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘దసరా’ అనే తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని చిత్ర యూనిట్ సమంతను అడగ్గా, ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయనని కరాకండిగా చెప్పేసిందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరును చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో హీరోయిన్ పాత్ర కోసం సమంతను చిత్ర యూనిట్ సంప్రదించారట.

అయితే తాను సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయనని చెప్పడంతో ఈ సినిమాలో ఆమె నటించేందుకు ససేమిరా అనేసిందట. దీంతో సమంత తన స్టార్‌డమ్‌ను ఏమాత్రం తగ్గించుకునేందుకు సిద్ధంగా లేదని, ఏదేమైనా ఆమె ఫస్ట్ హీరోయిన్‌కే ప్రిఫర్ చేస్తోందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి సమంత రిజెక్ట్ చేసిన ఈ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.