`రావణాసుర` గా రాబోతున్న ర‌వితేజ‌..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేశ్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయ‌న‌.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే త‌న 70వ చిత్రాన్ని సైతం ర‌వితేజ ప్ర‌క‌టించాడు.

RT70: Ravi Teja To Team Up With Sudheer Varma -

అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌గా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 5వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకి టైటిల్ పోస్టర్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Ravi Teja Joins Hands With Sudheer Varma For His 70th Movie

అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి `రావణాసుర` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని, `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనేది ట్యాగ్ లైన్ అని తెలుస్తోంది. మ‌రి టైటిలే ఇంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటే.. ఇక సినిమా ఫ్యాన్స్‌కి పూన‌కాలు తిప్పించ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు బావిస్తున్నారు.