స‌మంత‌తో తాప్సీ కీల‌క చ‌ర్చ‌లు..ఎందుకోస‌మో తెలుసా?

టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేసి ఆపై బాలీవుడ్‌కి మ‌కాం మార్చేసిన తాప్సీ.. అక్క‌డ బాగానే స‌క్సెస్ అయింది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన తాప్సీ.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌లె ఈ భామ నిర్మాత‌గానూ మారి ‘అవుట్‌సైడర్స్‌ ఫిల్మ్స్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించింది.

Taapsee Pannu Launches Her Own Production House Titled 'Outsiders Films'

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. తాప్సీ త‌న బ్యాన‌ర్‌పై మొద‌టి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌తో చేయ‌బోతోంద‌ట‌. అది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్ర‌మ‌ట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌పైనే తాప్సీ స‌మంత‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ని.. సామ్ సైతం ఇంట్ర‌స్ట్‌గానే ఉంద‌ని తెలుస్తోంది.

Samantha all set for Bollywood debut?

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. నిర్మాత‌గానే కాకుండా ఈ చిత్రంలో తాప్సీ ఓ కీల‌క రోల్‌ను కూడా పోషించబోతోంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రి ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. స‌మంత తొలి బాలీవుడ్ చిత్రం ఇదే అవుతుంది.