“ఎవడు బ్రో నీకు చెప్పింది..నీ సోది” అసహనం వ్యక్తం చేసిన రానా?

November 2, 2021 at 5:49 pm

హీరో రాణా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తూ తనదైన రీతిలో ఉంటాడు. తాజాగా రా నాకు అలాంటి సంఘటన ఎదురయ్యింది. ఇటీవలే విడుదలైన విరాటపర్వం సినిమా గురించి ఒక వెబ్ సైట్ రాసిన కథనం పై రానా స్పందిస్తు ఎలా ఇలాంటి వార్తలు సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే..

రానా నటించిన విరాటపర్వం సినిమా డైరెక్టర్ కు అలాగే సంగీత దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని, అందువల్ల ఇంతకాలం పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పున్నారంటూ రాసుకొచ్చారు.

దీంతో ఈ వార్త సోషల్ ఒకసారి గుప్పుమనడంతో అది చూసిన రానా ట్వీట్ చేస్తూ.. ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది అంటూ రానా సదరు వెబ్ సైట్ ఫై అసహనం వ్యక్తం చేశాడు. రానా ట్వీట్ చేసిన అనంతరం సదరు వెబ్ సైట్ దీనిని డిలీట్ చేయడం గమనార్హం.

“ఎవడు బ్రో నీకు చెప్పింది..నీ సోది” అసహనం వ్యక్తం చేసిన రానా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts