బిగ్ బాస్: ఆ పది మందికి సూపర్ ఛాన్స్..కాని పాపం కాజల్?

November 2, 2021 at 5:45 pm

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ మినహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మంది ఉండగా ఒకేసారి పది మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్క ఓటు వచ్చినయా నేను మాత్రం విశ్వాన్ని సైతం ఆమెను తీసుకెళ్లారు. జశ్వంత్ కెప్టెన్ కావడం వల్లే సేఫ్ అయ్యాడు. ఇక తాజాగా నామినేషన్స్ లో ఉన్న వాళ్లు ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది.

టాస్క్ లో గార్డెన్ ఏరియా లో ఒక సేఫ్ జోన్ డోర్ లోకి తమ ఫోటో కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు ఫోటోలు ఉన్న భాగాలు తీసుకొని పరిగెత్తాలి.ఇలా వెళ్లే క్రమంలో ఎవరు అయితే చివరగా సేఫ్ జోన్ లోకి వెళ్ళ్తారో, అతడితో పాటు అతని చేతిలో ఎవరి ఫొటో ఉన్న బ్యాగ్ ఉందో ఆ ఇద్దరు డేంజర్ జోన్ కి వెళ్తారు. ఈ గేమ్ లో కాజల్,శ్రీరామ్ తొలిరౌండ్ లోనే డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కాజల్ ఫోటో ఉన్న బ్యాగు తీసుకున్న శ్రీరామ్ చంద్ర ముందుగా గార్డెన్ లోకి వచ్చినప్పటికీ కావాలనే సేఫ్ జోన్ లోకి వెళ్లన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ లో ఎవరు గెలిచి ఎవరు నామినేషన్స్ నుంచి బయటపడ్డారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

బిగ్ బాస్: ఆ పది మందికి సూపర్ ఛాన్స్..కాని పాపం కాజల్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts