పుష్పక విమానం డైరెక్టర్ దామోదర్ గురించి తెలియని విషయాలు..!

పెళ్ళాం లేచిపోయింది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న పుష్పక విమానం సినిమా టీజర్ ఇప్పటికే అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శకుడు దామోదర్ ( సృజన్) గురించి అందరూ తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడుతున్నారు. ఈయన తండ్రి పేరుమోసిన కథా రచయిత అయిన అట్టాడ అప్పలనాయుడు.. ప్రస్తుతం ఈయన శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ ఏ కాలనీలో నివాసం ఉంటున్నారు.ఇక ఆయన తాత నక్సలైట్ నాయకుడు మామిడి అప్పలసూరి. ఈయన స్వగ్రామం కోమర్తి..సృజన మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారు. ఆ తర్వాత సినిమా మీద ఇష్టం ఉండడం తో మొదటి సారి తెలుగు కథలు గా చెప్పుకునే గురజాడ దిద్దుబాటు ఆధారంగా అనే ఒక షార్ట్ ఫిలిం తీశాడు.. ఇక ఈ షార్ట్ ఫిలిం అప్పట్లో దాసరి నారాయణరావు కూడా మెచ్చుకోవడం గమనార్హం..

గురజాడ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ షార్ట్ ఫిలిం తోనే మొదటి బహుమతిని గెలుపొందాడు. తర్వాత ఒక గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తెరకెక్కిన సన్నాయి షార్ట్ ఫిలిం కి కూడా దర్శకత్వం వహించారు..దీని ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది..తాజాగా ఫిల్మ్ సిటీలో పుష్పకవిమానం సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేస్తోంది. రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా పెట్టి పుష్పకవిమానం అనే సినిమాను తెరకెక్కించాడు.