పుష్పాల్లో దాక్షాయినిగా అనసూయ.. ఫస్ట్ లుక్ అదుర్స్..!!

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. సుకుమార్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో సునీల్, అనసూయ కూడా నటిస్తున్నారు. అయితే నిన్నటి రోజున పుష్ప సినిమాలో సునీల్ కు సంబంధించి పోస్టర్ విడుదల కాగా తాజాగా ఈ రోజున అనసూయ కి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు.

దాక్షాయిని పాత్రలో అనసూయ కనిపించనున్నట్లుగా వాటికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం.ఇందులో అనసూయ ఒళ్లంతా నగలు వేసుకొని.. చాలా మాస్ లుక్ లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు , టీజర్లు, సాంగ్స్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది.