న‌య‌న్ బ‌ర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాద‌ర్` టీమ్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంట‌ల‌కు న‌య‌న్‌ చేత కేక్ క‌ట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Nayanthara to pair up with Chiranjeevi in Koratala Siva directorial? | The News Minute

ఇదిలా ఉంటే.. న‌య‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న చిత్రాల నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా కాంబోలో తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాద‌ర్‌` చిత్రం నుంచి కూడా అదిరిపోయే అప్టేడ్ వ‌చ్చింది.

Full Swing On Chiranjeevi Godfather Music Sessions Details God Latest Update Megastar Ooty Bhola Shankar Acharya Father Movie Thaman Dop Neerav Sha-TeluguStop

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంపై తాజాగా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

Image

‘గాడ్‌ఫాదర్’ టీమ్ .. నయనతార కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఆ పాత్రకి నయన్‌ను ఫిక్స్ చేశార‌ని స్ప‌ష్టంగా అర్ధమైంది. కాగా, ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను మంజు వారియర్ పోషించిన విష‌యం తెలిసిందే.